నవతెలంగాణ – సదాశివనగర్ : మండల సమైక్య సమావేశం బాలంబాయి అధ్యక్షతన బుధవారం నిర్వహించడం జరిగింది. అందులో ఈ అంశాలు కొత్త సంఘాలు వృద్ధ సంఘాలు వికలాంగుల సంఘాలు ఏర్పాటు చేయడం, స్వయం సహాయక సంఘాలు గ్రామ సంఘాల బలోపేతం చేయడం, తీసుకున్న రుణాలు సద్వినియోగం చేసుకొని 100% రికవరీ అయ్యేటట్లు చూడటం, వరి కొనుగోలు కేంద్రా నిర్వహణ బాధ్యతలు చేపట్టడం, వ్యాపార అభివృద్ధి వ్యవసాయ ఆధారిత కార్యక్రమాలు సంఘ సభ్యులు చేపట్టి వారి ఆర్థిక అభివృద్ధి జరిగేటట్లు చూడడం, NRLM సంబంధించిన లోకోస్ డిజిటల్ AJEEVIKA రిజిస్టర్ వెంట వెంటనే కంప్లీట్ చేయాలని ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు మన స్వయం సహాయక సంఘాల ద్వారా వారికి లోన్లు ఇచ్చి కట్టుకునే విధంగా చూడాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామ సంఘ అధ్యక్షురాలు ఏఫిఎం ప్రసాద్, సీసీలు, Ms సిబ్బంది, తదితరులు హాజరైనారు.
మండల సమైక్య సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



