Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కౌలస్ నాళా ప్రాజెక్టుకు పెరిగిన నీటి ఉధృతి..

కౌలస్ నాళా ప్రాజెక్టుకు పెరిగిన నీటి ఉధృతి..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని సావర్గావ్ గ్రామం వద్ద నిర్మించిన కౌలాస్ నాళా ప్రాజెక్ట్   కు ఎగువన ఉన్న మహారాష్ట్ర కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో మంగళవారం రాత్రి నుండి నీటి ఉధృతి భారీగా పెరిగింది. మంగళవారం రాత్రి నుండి ప్రజలకు ప్రజలకు సమాచారం అందించి ఏ సమయంలోనైనా ప్రాజెక్టు గేట్లు తెరిచే అవకాశం ఉందని అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారులు తెలియజేసిన వివరాల ప్రకారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 అడుగులకు గాను 458 అడుగులు పూర్తిగా నిండి ఉందని ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం1. 237 టీఎంసీ కెపాసిటీ కలిగి ఉందని తెలిపారు.

బుధవారం ఉదయం 10 గంటల సమయం  నాటికి ప్రాజెక్టు లోకి 4 వేల113 క్యూసెక్కులు నీరు వచ్చి చేరిందని తెలిపారు. అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు వెంటనే మూడు గేట్లు ఎత్తివేసి దిగువకు వరద గేట్ల ద్వారా నీటిని 4 వేల 113 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.  అనంతరం మధ్యాహ్నం 1 గంట నాటికి 2వేల742, రెండు వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఉదయం పెరిగిన నీటి ఉదృతి మధ్యాహ్నం నాటికి తగ్గు ముఖం పట్టడంతో అధికారులు ఊపిరిపిలుచుకున్నారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు వివిధ గ్రామాల ప్రజలకు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -