– మండలం చేరుకున్న డీడీఆర్ఎఫ్
– వరదను పరిశీలించిన సీఐ
నవతెలంగాణ – అశ్వారావుపేట
మొంథా తుఫాన్ కారణంతో గత రెండు రోజులుగా నియోజక వర్గంలో ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశానుసారం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అశ్వారావుపేట కు చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాలను సీఐ నాగరాజు రెడ్డి,ఎస్.హెచ్.ఓ ఎస్ఐ యయాతి రాజు లు పరిశీలించారు. బుధవారం ఉదయం నాటికి నియోజక వర్గంలో ఐదు మండలాల్లో మొత్తం 154.8 మిమీ వర్షపాతం నమోదు అయినట్లు రెవిన్యూ శాఖ తెలిపింది.
మండలం వర్షపాతం
అశ్వారావుపేట 52.5
చండ్రుగొండ 48.2
అన్నపురెడ్డిపల్లి 28.2
దమ్మపేట 13.2
ములకలపల్లి 12.8
మొత్తం 154.8
ప్రస్తుతం సాగు అవుతున్న ఉద్యాన, వేరుశనగ ,ప్రత్తి, వరి తీగ జాతి కూరగాయల పంటల్లో ప్రత్తి కి స్వల్ప నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఏడీఏ పెంటేల రవికుమార్ తెలిపారు.



