కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం చేస్తున్న అభివృద్ధిని చూడలేక అసత్య ప్రచారాలు..
నవతెలంగాణ – మణుగూరు
పినపాక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ నాయ కులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీరినా కి నవీన్ మండిపడ్డారు. బుధవారం బుధవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి పుట్టినరోజు వేడుకలలో ప్రజలు బ్రహ్మరథం పట్టి పెద్ద ఎత్తున పాల్గొనటం చూసి బీఆర్ఎస్ నా యకత్వానికి మతిభ్రమించి అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. పొంగులేటిని విమర్శించే స్థాయి, అర్హ త బీఆర్ఎస్ నాయకులు కుర్రీ నాగేశ్వర రావుకు లేదని ఎద్దేవా చేశారు.
గతంలో రేగా కాంతారావుఫై అనేక ప్రగల్భాలు పలికి ఇప్పుడు పార్టీలు మారి ఊసరవెల్లి లా రంగులు మార్చి పొంగులేటి, పాయం పై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. ఆయన గతాన్ని మొత్తాన్ని మర్చిపోయా రన్నారు.ఆయన మాట్లాడిన ప్రతి మాట కు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంద న్నారు. పొంగులేటిది ప్రజాబలం అని స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రదాతలపై బీఆర్ఎస్ అనవసరపు విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. విమర్శ లు మాని, అభివృద్ధిని కళ్ళతో చూడా లని హితవు పలికారు. గత పది సంవ త్సరాలు మీరు అధి కారంలో ఉండి చేయ ని పనులను ఎమ్మె ల్యే పాయం వెంకటే శ్వర్లు పార్టీ అధికారంలోకి వచ్చిన 20 నెలలో చేసి చూపిస్తున్నాడన్నారు. గత ఎమ్మెల్యే అభివృద్ధి పనులను శిలాఫల కాలకే పరిమితం చేస్తే ప్రస్తుత ఎమ్మెల్యే కోట్లది ప్రత్యేక నిధులను తీసుకువచ్చి పనులు చేపించి ప్రారంభించారని తెలి పారు.
నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే అవినీతి, అరాచక పాలన, భూకబ్జాలు భరించలేక ప్రజలు అల్లాడి,బీఆర్‌ఎస్ పాలనకు చరమగీతం పాడి, అధిక మెజా ర్టీతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను గెలిపించారన్న సంగతిని బీఆర్ఎస్ నా యకులు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ఓడిన గెలిచిన అను నిత్యం ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ, ప్రజలతో మామేకమై ఉంటూ పార్టీలకతీతంగా నియోజక వర్గాన్ని అభివృద్ధి బాటలో ముందుకు నడిపిస్తున్న మా నాయకుడు పాయం వెంకటేశ్వర్లు అని గుర్తు చేశారు. మీ పాలనలో ఎన్నడు కూడా ప్రజలను పట్టించుకున్న పాపాన పోనీ మీరు రోడ్లు బాగు చేయలేదు అంటూ మొసలి కన్నీరు కారుస్తూ మీరు చూపించే కపట ప్రేమను నియోజకవర్గ ప్రజలు ఎవరుకూడా నమ్మ రన్నారు.సమావేశం లో టౌన్ అధ్యక్షులు బోనగిరి శివసైదులు, శివాలయం ఆలయ చైర్మన్ కూచిపూడి బాబు, టీవీ సుబ్బారెడ్డి,ఎనిక దినేష్, ,నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల మనిషి పాయంను విమర్శించే అర్హత లేదు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


