ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు ఎప్పటికపుడు పర్యవేక్షించాలి…
జిల్లా కలెక్టర్ హనుమంతరావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం జూమ్ మీటింగ్ ద్వారా జిల్లాలో చేపట్టాల్సిన చర్యల గురించి అదనపు కలెక్టర్ లు,రెవిన్యూ,ఆర్డీ వో, పోలీస్, ఇరిగేషన్, ఈ ఈ ఆర్ అండ్ బి, ఫైర్,మున్సిపల్ కమిషనర్ లు, తాసిల్దార్లు ఎంపీడీవోలు అన్ని శాఖలకు చెందిన జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా వర్షాల నేపథ్యంలో… ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోవు రెండు , మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నందువలన ప్రతి గ్రామంలో ప్రజలు ఎవ్వరు కూడా అనవసరంగా బయట రావద్దని ,ప్రయాణాలు చేయవద్దని, శిదిలావస్థ ఇండ్లలో నివసించకూడదని తెలిపారు.ఆలా నివసించిన వారిని గుర్తించి వేరే సురక్షిత ప్రదేశాలకు తరలించాలి. మూసి పరివాహక ప్రాంతాలలో మూసి నదిలోనికి చేపలు పట్టడానికి , పశువులను కానీ ఎవ్వరిని పోనివ్వొద్దని సూచించారు.చెరువులు అలుగుల వద్దకి కూడా ఎవ్వరిని పోనివ్వకుండా చూడాలన్నారు.గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి సిబ్బంది అందరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోని మీ విధులు నిర్వహించాలన్నారు.కరెంటు స్తంబాలు ట్రాన్స్ఫర్మర్స్ ముట్టుకోవద్దని పశువులను కూడా వర్షాలకు బయటకు వదలకుండా చూడాలని తెలిపారు. మీ గ్రామం పంచాయతీ సెక్రటరీ లకు చెప్పి గ్రామంలో టామ్ టామ్ వేపించి ప్రజలు ఎవ్వరు కూడా బయటకు రావద్దని అవగాహన కల్పించాలన్నారు.
చెరువుల వద్దకు, కాలువల వద్దకు ఎవ్వరిని పోవద్దని సంబంధిత అధికారులకు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడువకుండా టార్పాలిన్ లు కప్పి ధాన్యం ధాన్యం తడవకుండా చూడాలన్నారు. మెడికల్ సిబ్బంది గ్రామాలలో అందుబాటులో ఉంటూ అంటూ వ్యాధులు ప్రబల కుండా తగు చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు తెలిపారు.
లో లెవెల్ కాజ్ దారులు వద్ద ప్రవాహం ఎక్కువ ఉన్న ప్రదేశాలలో పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖలు టీం సమన్వయంతో ప్రజలను వాగులు చిన్న చిన్న బ్రిడ్జీలు దాట కుండా బారికే డ్ ల ను అడ్డం పెట్టి సిబ్బందిని నియమించాలన్నారు. వర్షాల వలన పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఎవ్వరు ఉండదని సూచించారు. జిపిఓ లు, వీఆర్ఏ , పంచాయతీ సెక్రటరీ లు అందరు కూడా మీ గ్రామాలలో తిరిగి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరుగ కుండా చూడాలని, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని తెలిపారు.
శిలవస్థ భవనాల్లో ప్రజలు ఉండకుండా చూడాలని,ఆ చుట్టూ పక్కల కుడా ఎవరు వెళ్లకుండా అవగాహన పరచాలని…దగ్గర లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు తెలియ జేయాలన్నారు. ఈ జూమ్ మీటింగ్ లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



