Thursday, October 30, 2025
E-PAPER
Homeజిల్లాలుమొంథా తాండవం..

మొంథా తాండవం..

- Advertisement -

-ఉధృతి దాల్చిన మోయతుమ్మెద వాగు

-దేవక్కపల్లిలో వంతెనపై ఆరబోసిన ధాన్యం నీటిపాలు

-పిల్లివాగులో గల్లంతైన పాడి గేదె..

-పిడుగుపాటుకు గేదె మృత్యువాత 

నవతెలంగాణ-బెజ్జంకి

మొంథా తుఫాన్ మండలంలో తాండవం చేసింది. బుధవారం రాత్రంతా ఏకదాటిగా కురిసిన వర్షానికి మండలంలోని మోయతుమ్మెద వాగు ఉదృతి దాల్చింది.గుగ్గీళ్లలో పిల్లి వాగు వంతెనపై వరద నీరు పొంగిప్రవహించింది.ఈదుల వాగు వంతెనపై వరద నీరు ప్రవహించింది.పలు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది.

దేవక్కపల్లిలో..

మండల పరిధిలోని దేవక్కపలిలో మోయతుమ్మెద వాగు తన ఉగ్రరూపం చూపింది.గ్రామంలోని పలువురు రైతులు వాగు వంతెనపై ఆరబోసిన వరిధాన్యం వరద ఉదృతికి నీటిపాలైంది.దీంతో రైతులు తీవ్ర అవేదన వ్యక్తం చేశారు.

గుగ్గీళ్లలో పిల్లివాగు..

నేదూనూరి బాలయ్యకు చెందిన పాడి గేదె పిల్లివాగులోని వరద ఉధృతికి గల్లంతైంది. వాగు ఒడ్డుకు కట్టెసిన సీతా భూమయ్యకు చెందిన రూ.1.20 లక్షల పాడి గేదే పిడుగుపాటుకు గురై మృత్యువాత పడింది.వాగు పక్కన ఆరబోసిన వరిధాన్యం నిల్వలు నీటమునిగాయి.

ప్రభుత్వం అదూకోవాలి

చేతికందిన వరిధాన్యం మొంథా తూఫాన్ వర్షపు వరద ఉదృతికి నీటిపాలైందని..మృత్యువాత పడిన పాడి గేదెల రైతులను ప్రభుత్వం అదూకోవాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు.

తహశీల్దార్ పర్యవేక్షణ..

గుగ్గీళ్లలో తహశీల్దార్ శ్రీకాంత్ పిల్లివాగు వరద ఉదృతిని పర్యవేక్షించారు.గ్రామంలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పర్యవేక్షించారు.

నష్టపరిహారం అందించాలి

చేలల్లో ఉన్న వరిధాన్యం నీటమునిగింది.చేతికందిన వరిధాన్యం మొంథా తూఫాన్ వర్షపు వరద ఉదృతికి నీటిపాలైంది.వరద ఉధృతకి, పిడుగుపాటుకు పాడి గేదెలు మృత్యువాత పడ్డాయి. తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి జాభితాను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందించేల ఎమ్మెల్యే అధికారులను అప్రమత్తం చేయాలి.నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలి.

-దీటీ రాజు, బెజ్జంకి బీఆర్ఎస్ బీసీ సెల్ నాయకుడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -