Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్రీడాకారిణిని అభినందించిన ఖోఖో అసోసియేషన్ చైర్మన్ బిల్లా అనిల్

క్రీడాకారిణిని అభినందించిన ఖోఖో అసోసియేషన్ చైర్మన్ బిల్లా అనిల్

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
ఖో ఖో పోటీలలో ప్రతిపక్కన పరిచి తన జట్టు నిలవడానికి కారణమైన అలల్ సృజనను ఖో ఖో అసోసియేషన్ చైర్మన్ బిల్లా అనిల్ఖో ఖో అసోసియేషన్ చైర్మన్ బిల్లా అనిల్ గురువారం శాలువా కప్పి సన్మానించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాలేజీ గ్రౌండ్లో జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ   ఈ నెల 23 నుండి 26 వరకు కర్ణాటక రాష్ట్రం దావనగిరి జిల్లా కేంద్రంలోని క్రీడామైదానంలో  జరిగిన 31వ దక్షిణ భారత జాతీయస్థాయి ఖో ఖో పోటీలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మహిళల జట్లు సంయుక్తంగా కాంస్య పధకం సాధించి మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నాయన్నారు. 

ఉమ్మడి నిజాంబాద్ జిల్లా  ఆర్మూర్ మండల్ ఫతేపూర్ గ్రామానికి చెందిన అలల్ సృజన తెలంగాణ మహిళా జట్టుకు ప్రాతినిధ్యం వహించి మంచి ప్రదర్శన చూపి తెలంగాణ విజయంలో కీలకపాత్ర పోషించింది. దీని సందర్భంగా జిల్లా ఖో ఖో జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అతిఖుల్లా లతో కలిసి క్రీడాకారిణినీ అభినందించి సన్మానించడం  జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు నరేష్ రెడ్డి , లింగం, సతీష్, రాజు, సంజీవులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -