- Advertisement -
నవతెలంగాణ-ఆమనగల్
తుఫాన్ వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు. గురువారం ఆయన కల్వకుర్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించారు. ఈసందర్భంగా వర్షం ధాటికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఆదిశగా వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పంటనష్టం వివరాలను సేకరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈకార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -


