Saturday, November 1, 2025
E-PAPER
Homeకరీంనగర్పడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి...

పడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి…

- Advertisement -

సిరిసిల్ల ఫ్యాన్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్ 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 

ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంట వర్షాల వల్ల తడిసిపోయాయని, తడిసిన పూర్తి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని సిరిసిల్ల ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం కురిసిన వర్షాల వల్ల మండలంలోని పలు గ్రామాల్లో రైతులు ఆరబెట్టిన పంట అంతా తడిసిపోవడంతో సిరిసిల్ల ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్ గురువారం పలు గ్రామాల్లో పర్యటించి తడిచిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడిసిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని  వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిన ఆదేశాలను అధికారులు పూర్తిస్థాయిలో ఆచరించేలా చర్యలు చేపట్టాలన్నారు. కురిసిన వర్షాల వల్ల చాలావరకు రైతుల ధాన్యం కొట్టుకుపోయాయని అలాంటి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -