Friday, October 31, 2025
E-PAPER
Homeజిల్లాలుపంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: సీపీఐ(ఎం)

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ – బల్మూరు 
ముంతా తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు 20వేల రూపాయలు ఇవ్వాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేశారు. మండల కార్యదర్శి శంకర్ నాయక్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో రైతులు నష్టపోయిన పంట పొలాలకు గురువారం వెళ్లి పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం మండల కార్యదర్శి మాట్లాడుతూ.. భారీ వర్షం రావడంతో చేతికొచ్చే పంట నీళ్ల పాలయ్యిందని వ్యవసాయ అధికారులచే నష్టపోయిన రైతుల పొలాలను సందర్శించి అంచనా వేసి వారిని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

పత్తి, మొక్కజొన్న, వరి ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు. రైతుల పరిస్థితిని ప్రభుత్వము అర్థం చేసుకొని మండల స్థాయి వ్యవసాయ అధికారులచే సర్వేలు చేయించాలని అన్నారు. నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 20వేల చొప్పున ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. 

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బల్మూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఇరువైపులా ఏసుకున్న పంటలు రైతుల పొలాలను సందర్శించి రైతుల వేసిన పంటలను పరిశీలించడం జరిగింది. నష్టపోయిన రైతాంగాలని ఆదుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎం శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఈ సంవత్సరము జూన్ నుంచి ఎడతెరిపి లేకుండా వస్తున్న వర్షాలకు వేసుకున్న పంటలన్ని దెబ్బతినడంతో అప్పులు తెచ్చి పెట్టుబడి చేసిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రైతాంగానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భరోసా ఇచ్చి నష్టపోయిన రైతులను పూర్తిగా ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) నాయకులు డిమాండ్ చేశారు. రెండో పంటపల్లి వేసుకుంటే పల్లి కూడా భారీ వర్షాల మూలంగా మొలకెత్తకుండా లక్షల పెట్టుబడి నష్టపోయే పరిస్థితి ఉందని అట్లాంటి వారికి సబ్సిడీ ద్వారా విత్తనాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు ఎండి లాల్ మొహమ్మద్, గ్రామ కార్యదర్శి బాబర్, ఆంజనేయులు, మాసయ్య, రైతులు సత్యము, శివ, చంద్రశేఖర్ రెడ్డి, మల్లేష్, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -