- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
గత రెండు రోజులు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండలంలోని కొండంపేట గ్రామానికి చెందిన చిర్ల రాజయ్య అనే రైతుకు చెందిన రూ.30 వేలు విలవగల గేదె చలిపిడుగుపాటుతో మృత్యువాత చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. గేదె యజమాని పూర్తీ వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం మేతకు వెళ్లిన గేదె సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వస్తున్న నేపధ్యంలో ఉరచేరువు వద్ద చలి పిడుగు వేసి గేదె అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలిపారు. ఆర్థికంగా ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -



