Friday, October 31, 2025
E-PAPER
Homeక్రైమ్వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి

వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ – భీమదేవరపల్లి
వాగు దాటుతూ ప్రమాదవశాత్తు నీటిలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని కొత్తపెళ్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపల్లికి చెందిన అప్పని నాగేంద్రం (58) హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఫండ్ పనిచేస్తున్నాడు. రోజువారి విధుల్లో భాగంగా బుధవారం రాత్రి పనులు ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. సాయినగర్ బస్సు స్టేజ్ నుండి కొత్తపల్లికి కాలినడకన వెళుతూ గ్రామ సమీపంలోని ఉధృతంగా ప్రవహిస్తున్నవాగును దాటే ప్రయత్నం చేశాడు. వాగులోని నీటి ఉధృతికి కొట్టుకొని పోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు గాలించగా వాగులో కొంత దూరం కొట్టుకొని పోయి శవమై కనిపించాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, భార్య అనిత ఉన్నారు. ముల్కనూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -