Friday, October 31, 2025
E-PAPER
Homeఖమ్మంజాబ్ మేళాలో ఉద్యోగాలు.. నియామకపత్రాలు అందించిన ఎమ్మెల్యే

జాబ్ మేళాలో ఉద్యోగాలు.. నియామకపత్రాలు అందించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి
ఈనెల 26న సత్తుపల్లిలో సింగరేణి, టాస్క్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగాజాబ్  మేళాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గురువారం స్థానిక అధికారిక క్యాంపు కార్యాలయంలో నియామకపు ఉత్తర్వుల పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ఏర్పాటు కోసం సింగరేణి, టాస్క్ సంస్థల సహకారంతో మెగా జాబ్ మేళాను నిర్వహించామన్నారు. ఈ జాబ్ మేళాలో సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 4611 మందిని వివిధ కంపెనీల ప్రతినిధులు ఉద్యోగాలకు ఎంపిక చేశారన్నారు.

హైదరాబాదు ఇతర నగరాలకు వెళ్లి ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడే అవకాశం లేకుండా సత్తుపల్లిలోనే జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ జాబ్ మేళా కార్యక్రమానికి పూర్తి సహాయ, సహకారాలు అందించిన సింగరేణి, టాస్క్ సంస్థల యాజమాన్యాలకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామకపు పత్రాలను అందిస్తూ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ కమల్ పాషా, పింగుల సామేలు, ఐ. శ్రీను, కాంతారావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -