జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పోలీసులు ప్రజా రక్షణే ద్వేయంగా రాత్రనక, పగలనక అనుక్షణం శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా నల్లగొండ జిల్లా పట్టణ కేంద్రంలో గురువారం నిర్వహించిన సైకిల్ ర్యాలీనీ ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పట్టణ కేంద్రంలోని యన్.జి కళాశాల నుండి జిల్లా ఎస్పీ సైకిల్ ర్యాలీ ప్రారంభించి ర్యాలీలో పాల్గొని రామగిరి మీదుగా క్లాక్ టవర్ వరకు పోలీసు సిబ్బంది,పట్టణ యువకులు, విద్యార్థులతో కలిసి అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ విధి నిర్వహణలో అమరులైన అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21ప్లాగ్ డే నిర్వహిస్తున్నామనీ, వారి త్యాగాల గుర్తుగా అమరవీరుల వారోత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు. దీనిలో భాగంగా ఈ రోజు పట్టణ కేంద్రంలో పోలీస్ అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరులైన వారి ఆత్మ శాంతి కలగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్,నల్లగొండ డిఎస్పి శివరాంరెడ్డి, ఏఆర్ డిఎస్పి శ్రీనివాసులు, సిఐలు రాఘవరావు, రాజశేఖర్ రెడ్డి,మహా లక్ష్మయ్య శ్రీను నాయక్ ఆర్ ఐ లు సంతోష్, శ్రీను,సూరప్ప నాయుడు, హరిబాబు ఎస్సైలు సైదులు, శంకర్, గోపాల్ రావు,వీరబాబు, శ్రావణి,మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



