Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్‌.ఐ.ఆర్‌ సన్నాహక ప్రక్రియను నిర్దిష్ట గడువు లోపు పూర్తి చేయాలి

ఎస్‌.ఐ.ఆర్‌ సన్నాహక ప్రక్రియను నిర్దిష్ట గడువు లోపు పూర్తి చేయాలి

- Advertisement -

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 

స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్‌ (ఎస్.ఐ.ఆర్) కోసం ముందస్తుగా చేపడుతున్న సన్నాహక ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా, నిర్దిష్ట గడువు లోపు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలో చేపడుతున్న ఎస్.ఐ.ఆర్ పూర్వ ప్రక్రియ పురోగతిపై కలెక్టర్ గురువారం నిజామాబాద్ సౌత్ తహసిల్దార్ కార్యాలయంలో ఏ.ఈ.ఆర్.ఓలు, బీ.ఎల్.ఓ సూపర్వైజర్లతో సమీక్షించారు. ఎస్.ఐ.ఆర్ సన్నాహక ప్రక్రియను తప్పిదాలకు తావులేకుండా పారదర్శకంగా చేపడుతూ, రెండు రోజులలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 

ప్రతి పోలింగ్ బూత్‌ పరిధిలో బాధ్యతాయుతంగా పని చేయాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో తప్పకుండా ఉండేలా నిశిత పరిశీలన జరపాలన్నారు. 2002 ఓటరు జాబితాతో 2025 జాబితాను మ్యాపింగ్ చేసి నాలుగు కేటగిరీలుగా విభజించడం జరిగిందని గుర్తు చేశారు. ఇందులో కేటగిరీ “ఏ” లో 1987 కంటే ముందు జన్మించి 2002 తో పాటు 2025 ఎలక్టోరల్ జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ “బి“ లో 1987 కంటే ముందు జన్మించి 2002 ఓటరు జాబితాలో లేకుండా 2025 జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ “సి“ లో 1987 నుంచి 2004 మధ్యలో జన్మించి 2025 ఓటరు జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ “డి” లో 2004 తరువాత జన్మించిన వారిగా విభజించడం జరిగిందని తెలిపారు.

మొదట మ్యాపింగ్ చేయబడిన కేటగిరి “ఏ” జాబితాను బిఎల్ఓ యాప్ ద్వారా నిర్ధారించుకోవాలని, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోర్టల్ లో నమోదు చేయబడుతుందని అన్నారు. ఆ తరువాత కేటగిరి సి, కేటగిరి డి లలోని ఓటర్లను కేటగిరి ఏ కు మ్యాపింగ్ చేయాలని, ఈ ప్రక్రియను ఎఈఆర్ఓ ల ఆధ్వర్యంలో బిఎల్ఓ సూపర్వైజర్లు, బిఎల్ఓ లు బిఎల్ఓ యాప్ ద్వారా శనివారం సాయంత్రం నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు. సమీక్షలో తహసిల్దార్ బాలరాజు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజయేందర్, ఏ.ఈ.ఆర్.ఓలు, బీ.ఎల్.ఓ సూపర్వైజర్లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -