Wednesday, May 14, 2025
Homeఅంతర్జాతీయంఅమెరికాకు సౌదీ భారీ డీల్‌

అమెరికాకు సౌదీ భారీ డీల్‌

- Advertisement -

– ట్రంప్‌ పశ్చిమాసియా పర్యటన ప్రారంభం
రియాద్‌:
అమెరికా అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌ పశ్చిమాసియా పర్యటన మంగళవారం ప్రారంభమ యింది. ముందుగా సౌదీ అరేబియాకు ట్రంప్‌ చేరుకున్నారు. ట్రంప్‌నకు యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా సుమారు 142 బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధ ప్యాకేజీని విక్రయించడానికి అమెరికా అంగీకరించింది. అమెరికా ఇప్పటి వరకూ చేసుకున్న ‘అతిపెద్ద రక్షణ సహకార ఒప్పందం’గా వైట్‌హౌస్‌ దీన్ని అభివర్ణించింది. ట్రంప్‌ సంతకం చేసిన ఈ ఒప్పందంలో వాయు-క్షిపణి రక్షణ, వైమానిక దళం, అంతరిక్ష పురోగతి, సముద్ర భద్రత, కమ్యూనికేషన్‌తో సహా 12 అంశాలు ఉన్నాయని వైట్‌హౌస్‌ తెలిపింది. సౌదీ అరేబియాతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అమెరికా నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనంగా ఒప్పందాన్ని వైట్‌హౌస్‌ పేర్కొంది. అమెరికా ఆయుధాలకు సౌదీ అరేబియా అతిపెద్ద వినియోగదారుడిగా ఉంది. అయితే ఈ ఒప్పందంలో ఎఫ్‌-35 జెట్‌ల విషయాన్ని వైట్‌హౌస్‌ ప్రస్తావించలేదు. ఈ యుద్ధవిమానాలను అమెరికా మిత్రదేశం ఇజ్రాయిల్‌ ఉపయోగించే అధునాతన ఆయుధాన్ని సౌదీ అరేబియాకు విక్రయించడానికి అమెరికా సిద్ధంగా ఉందా.. లేదా అనే విషయం ఇంకా స్పష్టంగా వెల్లడి కాలేదు.
కాగా, సౌదీ అరేబియా చేరుకున్న ట్రంప్‌ వెంట అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌, వాణిజ్య మంత్రి హోవర్డ్‌ లుట్నిక్‌, ఇంధన శాఖ మంత్రి క్రిస్‌ రైట్‌, ఇతర అధికారులు ఉన్నారు. సౌదీ అరేబియా ట్రంప్‌ కోసం ఏర్పాటు చేసిన విందులో పలు ప్రముఖ కంపెనీల సీఈఓలు కూడా పాల్గొన్నారు. ఈ పశ్చిమాసియా పర్యటనలో భాగంగా యూఏఈ, ఖతార్‌ను కూడా ట్రంప్‌ సందర్శించనున్నారు. తుర్కియే కూడా వెళ్లే అవకాశ ఉంది. నాలుగు రోజుల పాటు ట్రంప్‌ పశ్చిమాసియా పర్యటన సాగనుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ట్రంప్‌ చేపట్టిన తొలి పెద్ద పర్యటన ఇదే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -