Friday, October 31, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమొంథా తుఫాను ఎఫెక్ట్ తో 230 కి.మీ రోడ్లు ధ్వంసం

మొంథా తుఫాను ఎఫెక్ట్ తో 230 కి.మీ రోడ్లు ధ్వంసం

- Advertisement -

సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి 
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి 

మొంథా తుఫాను ఎఫెక్ట్ తో ఆర్ అండ్ బి రోడ్లు 334 లోకేషన్స్ లో 230 కి.మీ దెబ్బతిన్నాయని రోడ్లు భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం సీఎం వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దెబ్బతిన్న, కోతకు గురైన రోడ్లు, బ్రిడ్జిలు, కాజ్ వేల తాత్కాలిక పునరుద్ధరణకు సుమారు రూ.7కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.225 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు వేసినట్లు ఆయన తెలిపారు.

బుధవారం మా ఆర్ అండ్ బి ఈఎన్సి,సి.ఈ లు,ఫీల్డ్ ఇంజనీర్లను ఆయన అప్రమత్తం చేశాను. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాం అని వివరించారు. తుఫాన్ వల్ల అకాల వర్షాలతో ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వరి, పత్తి పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యం సుమారు 2లక్షల మెట్రిక్ టన్నులు ఐకెపి సెంటర్లో ఉన్నది మన ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంతడిసిన ధాన్యాన్ని కూడా కొని వెంటనే మిల్లులకు తరలించేలా ముఖ్యమంత్రి ,సివిల్ సప్లై మినిస్టర్  చొరవ చూపాలి అని కోరారు.

సేకరించిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించేలా.. మిల్లర్లు వెంటనే ఆ ధాన్యాన్ని తీసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పత్తి తేమ శాతానికి సంబంధించి ఇప్పటికే తాను సీసీఐ చైర్మన్ లలిత్ కుమార్ గుప్తాను ముంబై వెళ్లి మరీ కలసి రైతుల పక్షాన ప్రత్యేక విజ్ఞప్తి చేశాను అని చెప్పారు. తేమ శాతంలో సడలింపులు ఇచ్చి తెలంగాణ పత్తి రైతులను ఆదుకోవాలని కోరినట్లు వెల్లడించారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగంపై ప్రత్యేక దృష్టి సారించి వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తున్న” అని మంత్రి అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రితో పాటు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కూడా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -