Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి వర్గంలో మైనార్టీలకు స్థానం కల్పించడం హర్షనీయం

మంత్రి వర్గంలో మైనార్టీలకు స్థానం కల్పించడం హర్షనీయం

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు షేక్ ముబారక్
నవతెలంగాణ – తిమ్మాజిపేట

జాతీయ కాంగ్రెస్ పార్టీ కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు అజరుద్దీన్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల హర్ష వ్యక్తం చేస్తున్నట్లు మైనార్టీ సీనియర్ జిల్లా నాయకులు షేక్ ముబారక్ తెలిపారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ముస్లింలకు మంత్రి వర్గంలో స్థానం  కల్పించి ముస్లింల అభ్యున్నతికి కృషి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రతిష్టాత్మకమైందని అన్నారు.

ముస్లిం నిరుపేదలకు న్యాయం కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అన్ని రంగాల్లో వెనుకంజ స్థానంలో ఉన్న ముస్లింలను ముందు స్థానంలో నిలబెట్టే బాధ్యత తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ నాయకులు షేక్ ముబారక్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -