Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవంబర్ 3 నుంచి భీమన్న దేవుని ఉత్సవాలు 

నవంబర్ 3 నుంచి భీమన్న దేవుని ఉత్సవాలు 

- Advertisement -

 నవతెలంగాణ – ఆర్మూర్ 
మండలంలోని చేపూర్ గ్రామంలో ఆదివాసీ నాయక పోడ్ సంఘం ఆధ్వర్యంలో వచ్చేనెల నవంబర్ 3 నుండి 5వ తారీఖు వరకు జరగబోయే భీమన్న ఉత్సవాల పాంప్లెట్లను మండల అధ్యక్షుడు సురకంటి చిన్నారెడ్డి చేతుల మీదుగా  గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి, మీనుగు నాగరాజులు మాట్లాడుతూ.. నవంబర్ 3 నుంచి 5 వరకుకు జరగబోయే బీమన్న ఉత్సవాలతోపాటు మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ క్రీస్తు శేషులు మీనుగు పెద్ద రాజన్న జ్ఞాపకార్థం జిల్లా స్థాయిలో కబడ్డీ పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు వారి కుమారుడు ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు నాగరాజు ఈ సందర్భంగా తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లావ్యాప్తంగా ఆదివాసి సంఘం సభ్యులు వినియోగించుకొని కబడ్డీ పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.  ఈ కార్యక్రమంలో  విడిసి అధ్యక్షుడు సారంగి శ్రీకాంత్ మాజీ సర్పంచులు సత్యనారాయణ కుస్తాపురం గంగారెడ్డి మాజీ ఎంపిటిసి జన్నెపల్లి గంగాధర్. పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ సారాంగి శాంతి ,న్యాయవాది సింధు చరణ్, బట్టు నవీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -