- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
2019 సంవత్సరంలో పెసర పంట ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి వచ్చిన 48 బస్తాల కోసం ఏ ఒక్కరు పంట మాదే అని ముందుకు రాలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు ఆ పంటను ఆరు సంవత్సరాల క్రితం సీజ్ చేశారు. వాటిని మద్నూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో గురువారం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శంకర్, సొసైటీ కార్యదర్శి బాబురావు పటేల్ ఆధ్వర్యంలో పెసర్ల పంటకు వేలంపాట నిర్వహించారు. దీంతో ఈ పెసర్లను తూమ్ రాములు రూ. 29,000 వేలకు దక్కించుకున్నట్లు ఆర్ఐ శంకర్ విలేకరులకు తెలిపారు. వేలంపాటలో మొత్తం 8 మంది రైతులు పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ఎట్టికేలకు ఆరు సంవత్సరాల క్రితం సీజైన పంటకు అధికారులు వేలంపాట పూర్తి చేయడం జరిగింది.
- Advertisement -


