Friday, October 31, 2025
E-PAPER
Homeతాజా వార్తలుచేతికొచ్చే పంట.. వర్షార్పణం

చేతికొచ్చే పంట.. వర్షార్పణం

- Advertisement -

దంచి కొట్టిన వాన… రైతన్నల విలవిల
వర్షపు నీటితో నిండిపోయిన పంట పొలాలు
దిక్కుతోచని స్థితిలో రైతన్నల
ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకలు
నవతెలంగాణ – శాయంపేట

అకాల వర్షానికి వరి పత్తి పొలాలన్నీ నేలకు ఒరిగి నీటిలో మునిగి రైతులకి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. రైతులు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వరి కోయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిలో ఒక్కసారిగా భీకరమైన వర్షం ఏడతెరిపి లేకుండా కురవడం మూలంగా పంటలన్నీ  నీటిలో మునిగి వేలాడుతున్నాయి. నీట  మునిగిన పంటలను చూసిన రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. దేవుడా ఎందుకు మాకు ఈ శిక్ష అంటూ దిగాలుగా కూర్చుని రోదిస్తున్నారు. ఆరుగాలం కష్టించి పెట్టుబడి పెట్టిన పంట చేతికొస్తుందనే టైములో తీవ్రమైన మొంతా తుఫాను వల్ల నష్టపోయామని బాధను వ్యక్తం చేస్తున్నారు.

నీటిలో మునగడం వల్ల పంటలు అక్కరకు వచ్చే పరిస్థితి లేదు మండలంలోని 24 గ్రామపంచాయతీలలో బుధవారం కురిసిన తుఫాను తో వాగులు వంకలు కుంటలు చెరువులు నిండి వలుగు పారుతున్నాయి. ఎటు చూసినా జల ప్రవాహమే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎన్నడు లేని విధంగా వర్షాలు కురవడం రైతాంగానికి తీరని లోటును కలిగించింది. కౌలు రైతులు అప్పులు తెచ్చి పంట వేస్తే ఆ అప్పులకు వర్షం తోడై మరింత భారం పడేలా చేసింది ఎకరాల కొద్ది పంటలు నీటిలో మునిగిపోయాయి. వాగులు పొర్లిపోవడం వలన చుట్టుపక్కల పంట పొలాలు నీటి తాకిడికి కొట్టుకుపోయాయి. పెట్టుబడి మొత్తం నీటిలో కొట్టుకుపోయిందని పొలాలను చూసిన రైతులు మనసులో మదన పడుతున్నారు. ప్రభుత్వం అధికారుల ద్వారా సర్వే చేయించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి

నాకు తొమ్మిది ఎకరాల 31 గుంటల భూమి ఉంది ఇందులో నేను వరి పంట వేశాను అకాల వర్షానికి పంట మొత్తం నీటి మునిగింది వరద తాకిడి ఎక్కువగా రావడం వల్ల చేతికొచ్చే పంట పూర్తిగా అడ్డం పడి నీళ్ల పాలయింది 10 రోజుల్లో పంట కోసేది నోటికాడి పంట నీళ్ల పాలైంది లక్షల్లో నష్టం వాటిల్లింది ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.

పెద్దిరెడ్డి రాజిరెడ్డి వరి రైతు పత్తిపాక.. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి
నేను సన్న కారు రైతును నాలుగు ఎకరాలు పత్తి వేశాను. పంట వేసినప్పటి నుండి అకాల వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ వర్షాభావం వల్ల పత్తి చెట్లు పూర్తిగా కాండం నీటిలో నాని మొక్క చనిపోవడం జరిగింది కొన్ని చెట్లకు కాయలు కాసినప్పటికీ పత్తి ఏరే టైంలో వర్షాలు రావడం వల్ల ఆ పత్తి వాన నీటికి నాని నల్లగా మారుతున్నది. ఇప్పటివరకు పత్తి ఏరింది లేదు కూలీల ను పంట చేనులోకి తీసుకెళ్లేసరికి బుధవారం కురిసిన వర్షానికి అది పూర్తిగా తడిచింది. ఆ పత్తిని మిల్లుల వారు కొనే పరిస్థితి లేదు. ఏరిన కూల్లు కూడా వచ్చే పరిస్థితి లేదు పూర్తిగా నష్టపోయాం. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -