నవతెలంగాణ – సదాశివనగర్
సదాశివ నగర్ మండలంలోని స్వయం సహాయక సంఘాల బలోపేతానికి శిక్షణ కార్యక్రమాన్ని గురువారం స్థానిక రైతు వేదికలో మండల సమైక్య అధ్యక్షురాలు బాలం బాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడమైనది. ఈ శిక్షణ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా నుంచి సీనియర్ కమ్యూనిటీ బేసిక్ రిసోర్స్ పర్సన్ CRP జ్యోతి సరళ పాల్గొని శిక్షణ ఇవ్వడం జరిగింది. స్వయం సహాయక సంఘాల్లో ప్రతి నెల పొదుపులు అప్పులు బ్యాంకు రుణాలు శ్రీనిధి అప్పులు తీసుకొని ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా నిర్వహించుకోవాలని అంశాలపై సుదీర్ఘంగా చెప్పడం జరిగింది.
గ్రామస్థాయిలో స్వయం సహాయక సంఘాల్లో కట్టుబాట్లపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని గ్రామ సంఘాల్లో పాలకవర్గ సభ్యుల విధులు బాధ్యతలపై వివరించడం జరిగింది. కోటి మంది మహిళలను కోటేశ్వర్లు చేయాలని ఉద్దేశంతో గ్రామాల్లోని మహిళలందరినీ సంఘాలలో చేర్పించాలని వివరించడం జరిగింది. కార్యక్రమంలోని గ్రామ సంఘాల నుంచి అధ్యక్షులు పాల్గొని శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అనంతరం ఏ పి ఎం ప్రసాద్ మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులందరూ ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి పథంలో ముందుండాలని మహిళలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు బలం భాయ్ సీసీలు అంజయ్య రాజు, భూమయ్య, అకౌంటెంట్ రమేష్ పాల్గొనడం జరిగింది.



