Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బ్రిడ్జి ఎత్తును పెంచేందుకు చర్యలు తీసుకోవాలి: సీపీఐ(ఎం)

బ్రిడ్జి ఎత్తును పెంచేందుకు చర్యలు తీసుకోవాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

-మండల కార్యదర్శి శంకర్ నాయక్ 
నవతెలంగాణ – బల్మూరు

బల్మూరు నుండి అచ్చంపేటకు వెళ్ళు మార్గంలో పోలీస్ స్టేషన్ దాటంగానే వచ్చే బ్రిడ్జి ఎత్తును పెంచాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. వర్షాకాలంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రాకపోకలు నిలిచి అటు లింగాల ఎటు అచ్చంపేట మరియు పరిసర గ్రామాల ప్రజల రాకపోకలకు  తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత రెండు రోజులుగా వరద నీరు ఉదృతంగా పారడంతో ప్రయాణికులకు అంతరాయం ఏర్పడి రోజంతా రహదారి గుండా  నడవలేకపోయారని ద్విచక్ర వాహనాలు పోలేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆ బ్రిడ్జి ఎత్తు పెంచి నిర్మాణం చేపడితే రాకపోకలకు అంతరాయం లేకుండా ఉంటదని వారు అన్నారు.

బల్మూరు చెరువు నిండి అలుగు వారి చెరువు వెనకాల కాలువ లేకపోవడంతో ఎనకాల వేసుకున్న వరి పంట మొత్తం దెబ్బతిని వరి పొలాల మీదుగా వర్షపు నీరు వస్తుందని, చెరువుకత్వ నుండి వచ్చే నీళ్లకు కాలువల మరమ్మత్తు చేపట్టి రైతుల పొలాలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. అచ్చంపేట స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ  గారు స్పందించి  సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు ఎండీ లాల్ మహ్మద్ గ్రామ కార్యదర్శి బాబర్ ఆంజనేయులు మాసయ్య సత్యం చంద్రశేఖర్ రెడ్డి రైతులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -