నవతెలంగాణ – ఆమనగల్ : విధుల్లో చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉన్నత అధికారులచే ఉత్తమ అవార్డు అందుకున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ కే.దశరథ్ కు సీఐ బద్యానాద్ చౌహాన్ నగదు రివార్డు అందజేశారు. ఈమేరకు గురువారం ఆమనగల్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2022 జనవరి నెల లో తెలంగాణ కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టు నుంచి బదిలీపై వచ్చిన దశరథ్ అంకిత భావంతో విధులు నిర్వహిస్తు బెస్ట్ ఎంప్లాయి గా ఎంపికై ఆగష్టు 15న జిల్లా కలెక్టర్ నుంచి ప్రశంసాపత్రం అందుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 27 వాహనాలను అదుపులోకి తీసుకోవడంతో పాటు నల్ల బెల్లం, నాటు సారా నియంత్రణకు విశేష కృషి చేస్తున్న దశరథ్ ను అభినందిస్తూ తన తరపున రూ.5 వేలు నగదు పురస్కారం అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
కానిస్టేబుల్ కు నగదు రివార్డు అందజేసిన ఎక్సైజ్ సీఐ కానిస్టేబుల్ కు..
- Advertisement -
- Advertisement -



