Friday, October 31, 2025
E-PAPER
Homeజిల్లాలుmontha cyclone: పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే 

montha cyclone: పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే 

- Advertisement -

క్షేత్రస్థాయిలో సర్వే చేసి వివరాలు సేకరించాలి 

నవతెలంగాణ మిర్యాలగూడ 
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నేలబారిపోయిన పంట పొలాలను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి  పరిశీలించారు. నియోజవర్గంలోని పలు గ్రామాలలో గురువారం నెలకొరిగిన వరి పంటను నేరుగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొంథా తుఫాన్ దాటికి పడిపోయిన పంటపొలాల వివరాలను వ్యవసాయ అధికారులు క్షేత్రశాలలో సర్వే చేసి సేకరించాలని కోరారు. రైతులు ఫోన్ చేసిన వెంటనే అధికారులు అక్కడికి వెళ్లి నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేసుకోవాలని ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహార అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు శంకర్ రెడ్డి, కోడి రెక్క సారీ, నాయకులు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -