- Advertisement -
నవతెలంగాణ – తిమ్మాజిపేట
మొంథా తూఫాన్ ప్రభావం వల్ల తిమ్మాజిపేట మండలంలో దెబ్బతిన్న పంటలను మండల వ్యవసాయ అధికారి కమల్ కుమార్ గురువారం పరిశీలించారు. మండలంలోని వివిధ గ్రామాలలో చెరువుల కింద ఆయకట్టు పొలాల్లో తిరుగుతూ దెబ్బతిన్న పంట పొలాల వివరాలను గుర్తించారు. పత్తి 475 ఎకరాలు, వరి పంట 131 ఎకరాలు పాడైపోయినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. వర్ష ఉధృతి ప్రభావం వల్ల సాగుచేసిన పంటలు వరి, పత్తి పంటలు పూర్తిగా నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం కింద ఆదుకోవాలని అన్నారు. వారి వెంట ఆయా గ్రామ రైతులు వ్యవసాయం విస్తరణ అధికారులు ఉన్నారు.
- Advertisement -



