Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్Cyclone Montha : నష్టపోయిన రైతాంగానికి నష్ట పరిహారం కట్టించాలి 

Cyclone Montha : నష్టపోయిన రైతాంగానికి నష్ట పరిహారం కట్టించాలి 

- Advertisement -

బీజేపీ మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్ 

నవతెలంగాణ నెల్లికుదురు : మొంథా తుఫాన్ వచ్చి రైతాంగం వేసిన పంటలు నష్టపోయామని నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వమే తక్షణమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్ ప్రభుత్వ డిమాండ్ చేసినట్టు తెలిపారు. మునిగలవీడు గ్రామంలో నష్టపోయిన  రైతులు తుప్పతూరి గంగరాజు బారాజు రమేష్ ఉగ్గ  పుల్లయ్య చందు యాకన్న రైతుల పొలంలో పర్యటించి పరిశీలించే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నేలమట్టమైన వరి మొక్కజొన్న పత్తి ఇతరత్రా పంటలు నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి తీరా చేతికందే సమయానికి అతి భారీ వర్షాలు కోరడంతో పంటలు మొత్తం నీలమట్టమయి చేతికందక నష్టపోయామని రైతాంగం కన్నీరు మున్నేరు అవుతున్నారని అన్నారు. రైతులను ప్రభుత్వం తాక్షణమే ఆదుకోవాలని కోరారు. ఎకరాకు కనీసం 30 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని లేకపోతే ప్రభుత్వంపై పోరుబాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు బొబ్బల కృష్ణ తూమ్ శ్రీను ఎండి ముస్తఫా మండల ఉపాధ్యక్షులు కుక్కల ఐలయ్య దుస్స యాకన్న రైతులు పాల్గొన్నారు.

తాక్షణమే ఆదుకోవాలని కోరారు. ఎకరాకు కనీసం 30 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని లేకపోతే ప్రభుత్వంపై  పోరుబాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు బొబ్బల కృష్ణ తూమ్ శ్రీను ఎండి ముస్తఫా మండల ఉపాధ్యక్షులు కుక్కల ఐలయ్య దుస్స యాకన్న రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -