Friday, October 31, 2025
E-PAPER
Homeజిల్లాలునీట మునిగిన పంటలపై నివేదిక ఇవ్వాలి

నీట మునిగిన పంటలపై నివేదిక ఇవ్వాలి

- Advertisement -

– జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్

నవతెలంగాణ నూతనకల్: మొంథ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల దెబ్బ తిన్న, నీట మునిగిన పంటలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ అధికారిని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. గురువారం నూతనకల్ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో పర్యటించారు మిర్యాల గ్రామంలో చెందిన ఎర్పుల రామలింగం పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఎన్ని ఎకరాలలో సాగు చేసారు అని రైతును అడగగా నాలుగు ఎకరాలలో సాగు చేసానని ఒక్కసారి పత్తి తీసామని రెండో సారి తీయుటుకు సిద్ధం అయ్యే లోపు వర్షంతో తడిచి పత్తి దెబ్బ తిన్నదని వివరించారు. అనంతరం మండల కేంద్రం నుండి- తాళ్ల సింగారం వెళ్లే రోడ్డులో తుమ్మల చెరువు అలుగు పోయటం వల్ల నీట మునిగిన పంటను పరిశీలించారు.

పొలాల్లాలో నీరు పోయేందుకు తగ్గిన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ ఏ ఈ ని ఆదేశించారు. సీలింగ్ భూములకు చెందిన రైతులు త్వరగా మా భూములకు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ ని కోరగా మీ సమస్య త్వరలో పరిష్కారం కాబోతుందని ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి, నోటీసులు ఇచ్చి, సర్వే చేశామని మీకు పట్టాలు ఇచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సూర్యాపేట- దంతాలపల్లి రోడ్డులో గుండ్ల సింగారం వద్ద పాలేరు వాగుపై ఉన్న బ్రిడ్జిని పరిశీలించారు. అంతకుముందు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్ ను పరిశీలించారు. ఎన్ని గన్ని సంచులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలకు గన్ని సంచులు త్వరగా సరఫరా చేయాలని ఆదేశించారు. అక్కడే ఉన్న హమాలీలతో మాట్లాడారు. వారితో పాటు తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎంపిడిఓ సునీత, ఏ.ఓ మల్లారెడ్డి, ఎంపిఓ శశికళ, ఏ ఈ ఓ భవ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -