Saturday, January 3, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునేడు రాష్ట్ర మంత్రిగా అజహరుద్దీన్‌ ప్రమాణం

నేడు రాష్ట్ర మంత్రిగా అజహరుద్దీన్‌ ప్రమాణం

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ప్రముఖ మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ శుక్రవారం ఉదయం 12.15 గంటలకు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. రాజ్‌భవన్‌ కార్యాలయ అధికారులు ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఇతరుల ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇదిలా వుండగా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో నూతన మంత్రివర్గ విస్తరణను తక్షణమే నిలిపివేయాలంటూ బీజేపీ, బీఆర్‌ఎస్‌లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ లేఖను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్టు తెలిసింది. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే తాము నడుకుంటామని రాజ్‌భవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -