- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్‌ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం విషాదం చోటుచేసుకుంది. మల్లేపల్లిలో చెరువులో ఈతకు దిగిన ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. మృతులు తరుణ్ యాదవ్, పార్ధు, హర్షవర్ధన్, చరణ్‌గా గుర్తించారు. గల్లంతైన ఐదుగురు చిన్నారుల మృతదేహాల కోసం పోలీసులు, గ్రామస్థులు, గజఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో మల్లేపల్లి గ్రామంలో ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
- Advertisement -