Friday, November 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం12 ఐడీ కార్డుల్లో ఏదైనా సరే..

12 ఐడీ కార్డుల్లో ఏదైనా సరే..

- Advertisement -

ఓటు వేయొచ్చు : హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

ఓటరు జాబితాలో పేరు ఉండి.. ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా పర్వాలేదు.. ఓటర్లు ఎపిక్‌ కార్డు కాకుండా 12 ప్రత్యామ్నాయ ఫొటో ‘ఐడీ’ల్లో దేన్నైనా ప్రదర్శించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్‌ 11న జరగనున్న జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు జాబితాలో ముందుగా పేరును పరిశీలించుకోవాలని సూచించారు. ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్‌ కార్డు) కాకుండా 12 ప్రత్యామ్నాయ ఫొటో ఐడీల్లో దేన్నైనా పోలింగ్‌ సిబ్బందికి చూపి ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు.

ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డులు ఇవే..
ఆధార్‌, ఉపాధి హామీ జాబ్‌ కార్డు, బ్యాంకు, తపాల కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్‌, కేంద్ర కార్మికశాఖ జారీ చేసిన ఆరోగ్యబీమా స్మార్ట్‌ కార్డు లేదా ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌(ఎన్‌ఏఐ) కింద రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సెస్‌ కమిషనర్‌ ఇండియా (ఆర్‌జీఐ) జారీ చేసిన స్మార్ట్‌ కార్డు, భారతీయ పాస్‌పోర్ట్‌, ఫొటోతో కూడిన పెన్షన్‌ పత్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్‌యూలు, పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్‌ డిజేబుల్‌ గుర్తింపు కార్డు (యూడీఐడీ)లో ఏదైనా ఒకటి కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -