Thursday, November 20, 2025
E-PAPER
Homeజాతీయంతదుపరి సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌

తదుపరి సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌

- Advertisement -

నవంబర్‌ 24న పదవీ బాధ్యతలు
కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌


న్యూఢిల్లీ : భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్‌ సూర్యకాంత్‌ నియమితులయ్యారు. ఆయన నియామకానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఆయన నియామకాన్ని ప్రకటిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో భారత 53వ సీజేఐగా ఆయన నవంబర్‌ 24న బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ భూషణ్‌ ఆర్‌ గవాయ్.. నవంబర్‌ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానం లో జస్టిస్‌ సూర్యకాంత్‌ నియమితులయ్యారు.

సీజేఐగా ఆయన ఈ పదవి లో 15 నెలల పాటు ఉంటారు. ఫిబ్రవరి 9, 2027న 65 ఏండ్ల వయస్సు నిండిన తర్వాత ఆయన పదవీ విమరణ చేయనున్నారు. భారత రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను ఉపయోగించి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ను 2025 నవంబర్‌ 24 నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం పట్ల రాష్ట్రపతి సంతోషంగా ఉన్నారని కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. అలాగే జస్టిస్‌ సూర్యకాంత్‌కు అభినందనలు, శుభాకాంక్షలను తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -