Friday, October 31, 2025
E-PAPER
Homeబీజినెస్బృహస్పతి టెక్నాలజీస్‌కు కోల్‌కతా మెట్రో సీసీటీవీ కాంట్రాక్టు

బృహస్పతి టెక్నాలజీస్‌కు కోల్‌కతా మెట్రో సీసీటీవీ కాంట్రాక్టు

- Advertisement -

హైదరాబాద్‌ : ప్రముఖ సిసిటివి సరైలెన్స్‌ సిస్టమ్‌ ఇంటిగ్రేటర్‌ కంపెనీలలో ఒకటైన బృహస్పతి టెక్నాలజీస్‌ లిమిటెడ్‌కు కోల్‌కతా మెట్రో రైల్వే ఉత్తర, దక్షిణ (బ్లూ లైన్‌) మార్గంలో ఐపీ ఆధారిత సీసీటీవీ సర్వైలెన్స్‌ సిస్టమ్‌ అప్‌గ్రేడేషన్‌ ప్రాజెక్ట్‌ దక్కినట్టు ఆ సంస్థ తెలిపింది. దీని కాంట్రాక్టు విలువ రూ.25.34 కోట్లుగా ఉందని పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా పాత అనలాగ్‌ సిస్టమ్‌లను ఆధునిక ఐపీ ఆధారిత సర్వైలెన్స్‌ టెక్నాలజీతో మార్చి భద్రతను మరింత బలపర్చనున్నట్లు బృహస్పతి టెక్నాలజీస్‌ ఎండీ, సీఈఓ రాజశేఖర్‌ పాపోలు తెలిపారు. ఈ విప్లవాత్మక ప్రాజెక్ట్‌లో కోల్‌కతా మెట్రోతో భాగస్వామ్యం కావడం తమ అదృష్టమన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -