Friday, October 31, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమునుగోడు అభివృద్ధి తప్ప మరో ఆలోచన లేదు

మునుగోడు అభివృద్ధి తప్ప మరో ఆలోచన లేదు

- Advertisement -

పార్టీ మారుతున్నానంటూ కావాలనే ప్రచారం చేస్తున్నారు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

నవతెలంగాణ-చౌటుప్పల్‌
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి గురించి తప్ప తనకు పార్టీ మారే ఆలోచన లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం చెరువుతో పాటు చౌటుప్పల్‌, తంగడపల్లి చెరువును ఆయన సందర్శించారు. అలుగుపోస్తున్న చెరువులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతున్నానని, పార్టీకి రాజీనామా చేస్తున్నానని కావాలనే బీఆర్‌ఎస్‌ పార్టీ వారు, కాంగ్రెస్‌ పార్టీలో కొందరు తనపై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా తాను ఏదైనా నిర్ణయం తీసుకుంటే స్వయంగా ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రకటిస్తానన్నారు.

తాను సిన్సియారిటీ కలిగిన కాంగ్రెస్‌ కార్యకర్తనని, ఎమ్మెల్యేనని అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు పనిచేస్తానని తెలిపారు. క్రమశిక్షణ గల కాంగ్రెస్‌పార్టీ నాయకునిగా, కార్యకర్తగా రాహుల్‌గాంధీ నాయకత్వంలో పార్టీ కోసం పనిచేస్తానన్నారు. తనపై సోషల్‌ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట్రాంరెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మెన్‌ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మెన్‌ వెన్‌రెడ్డి రాజు, నాయకులు పబ్బు రాజుగౌడ్‌, సుర్వి నర్సింహాగౌడ్‌, బత్తుల విప్లవ్‌కుమార్‌గౌడ్‌, పాశం సంజయ్ బాబు, ఎమ్‌డి.బాబాషరీఫ్‌, మొగుదాల రమేశ్‌, సందగల్ల సతీశ్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -