Friday, October 31, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమజ్లిస్‌కు రక్షణ కవచంలా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌

మజ్లిస్‌కు రక్షణ కవచంలా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌

- Advertisement -

గోరక్షకులపై పోలీసు కేసులు నమోదు దారుణం
ఎంఐఎం అండతోనే ఇబ్రహీం ఖురేషి ఆగడాలు
స్లాటర్‌ హౌజ్‌లలో బంగ్లా కార్మికులు : కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మజ్లిస్‌ పార్టీకి రక్షణ కవచాలుగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు తయారయ్యాయని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆవులను అక్రమంగా తరలిస్తున్న వారిని వదిలేసి అడ్డుకుని ప్రశ్నించిన గోరక్షక్‌ సేవకుడు ప్రశాంత్‌ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఘట్‌కేసర్‌లో గోరక్షకులపై జరిగిన దాడిని ఖండించారు. గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ధైర్యంగా చర్యలు తీసుకుంటే వెంటనే ఎంఐఎం నాయకులు ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి ఒత్తిళ్లు తెస్తున్నారని ఆరోపించారు.

స్లాటర్‌ హౌజ్‌ల నియంత్రణకు పలు చట్టాలు, నిబంధనలు తీసుకొచ్చినా అవి తెలంగాణలో అమలు కావడం లేదని విమర్శించారు. అక్రమ స్లాటర్‌ హౌజ్‌ల్లో బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన ఇల్లీగల్‌ కార్మికులు పనిచేస్తున్నారనీ, ఈ మాఫియాకు మజ్లిస్‌ పార్టీ నాయకులే అండగా ఉన్నారని ఆరోపించారు. ఇబ్రహీం ఖురేషీపై అనేక క్రిమినల్‌ కేసులున్నాయని తెలిపారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మెన్‌, బీఆర్‌ఎస్‌ నేత మహ్మద్‌ సలీంతో ఖురేషీకి సత్సంబంధాలున్నాయని ఆరోపించారు. తెలంగాణలోని 39 అక్రమ స్లాటర్‌ హౌజ్‌లపై ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి లేఖలు రాసినా ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ ఎంపిక గాంధీభవన్‌లో జరగలేదనీ, దారుసలాం ఆదేశాలతోనే జరిగిందని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -