- Advertisement -
మంచిరేవుల, కిస్మత్‌పూర్ వద్ద రాకపోకలు బంద్
నవతెలంగాణ-గండిపేట్
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాలకు వరద పోటెత్తుతుండటంతో అధికారులు గురువారం గేట్లు ఎత్తారు. గండిపేట్ (ఉస్మాన్‌సాగర్) ఆరు గేట్లు, హిమాయత్‌సాగర్ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. వరద ఉధృతికి హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద మూసీ బ్రిడ్జి డ్యామ్, మంచిరేవుల ఔటర్‌రింగ్ రోడ్డు వద్ద బ్రిడ్జి తెగిపోయింది. ఫుట్‌పాత్ పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో మంచిరేవుల బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. రాకపోకలు పూర్తిగా నిలిచాయి. కిస్మత్‌పూర్ బ్రిడ్జిపై నుంచి వరద ఉధృతంగా రావడంతో రాకపోకలు నిలిపివేశారు.
- Advertisement -

 
                                    