Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అన్నదాతల రెక్కల కష్టం గంగ పాలు

అన్నదాతల రెక్కల కష్టం గంగ పాలు

- Advertisement -

భారీ వర్షాలకు నీట మునిగిన పంటలు
ఆందోళన చెందుతున్న అన్నదాతలు 
నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ 
నవతెలంగాణ -పెద్దవంగర: అకాల వర్షాలతో అన్నదాతల రెక్కల కష్టం గంగ పాలయింది. మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బలమైన ఈదురు గాలులు వీయడంతో వరి పొలాలు, కోత దశలో నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి అందివచ్చే సమయంలో నోటికాడి బువ్వను లాక్కున్నట్టు అయిందని మండలంలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దవంగర, కొరిపల్లి, వడ్డెకొత్తపల్లి గ్రామాల్లో వరి పొలాల్లో మోకాళ్ళ లోతు వరకు వరద నీరు చేరడంతో రైతులు గుండెలవిసేలా రోదించారు. పలు గ్రామాల్లో వరి పొలాల్లో ధాన్యం గింజలు రాలడం తో రైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు పంట నష్టం అంచనా వేస్తున్నారు. అకాల వర్షాలకు మండలంలో సుమారు 1500 నుండి 2000 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -