Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ జెడ్పిటిసి అనారోగ్యంతో మృతి 

మాజీ జెడ్పిటిసి అనారోగ్యంతో మృతి 

- Advertisement -

నవతెలంగాణ-నిజాంసాగర్ 
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాన్సువాడ సమితి మాజీ అధ్యక్షులు, నిజాంసాగర్ మండలం మాజీ జెడ్పిటిసి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లూరు వాసి గొర్రె కృష్ణారెడ్డి గురువారం సాయంత్రం  హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం సహకరించక పోవడం, వృద్యాపంతో మరణించారు.కృష్ణారెడ్డి  కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో సేవలందించారు. నిజాంసాగర్ మండలానికి అభివృద్ధి పథంలో మార్గదర్శకుడిగా నిలిచిన ఆయన తన రాజకీయ జీవితమంతా ప్రజల సేవకే అంకితం చేశారు. 
సంతాపం వ్యక్తం చేసిన మండల అధ్యక్షుడు
జెడ్పిటిసి గా కృష్ణారెడ్డి ఉన్న సమయంలో ప్రస్తుత నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆయన హయంలో  వైస్ ఎంపీపీగా ఆయనతో కలిసి పనిచేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో, గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో ఆయనతో పని చేసిన రోజులను గుర్తు చేశారు. ఆయన మృతి నిజాంసాగర్ మండలానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని  బాధ ను వ్యక్తం చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -