Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
రాష్ట్రీయ ఏక్తా దివాస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం గాంధారి మండల కేంద్రంలో రన్ ఫర్ యూనిటీ (2కే) కార్యక్రమం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరుగులో వివిధ పార్టీల రాజకీయ నాయకులు యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై ఏకతా సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో గాంధారి మాజీ సర్పంచ్ ముమ్మాయి సంజీవ్ యాదవ్, మాజీ ఎంపీటీసీలు తూర్పు రాజులు, పత్తి శ్రీనివాస్, కామిల్లి బాలరాజ్, బిజెపి మండల అధ్యక్షుడు మధుసూదన్, వి డి సి అధ్యక్షుడు ఆకుల రామస్వామి, ఉపాధ్యక్షుడు చాకలి మోహన్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు నితిన్, మోతిలాల్, రాకేష్, శివకుమార్, లక్ష్మణ్ పోలీస్ శాఖ సిబ్బంది గ్రామంలోని యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -