నవతెలంగాణ – కంఠేశ్వర్ 
సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్బంగా  జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా యూనియన్ హోమ్ సెక్రెటరీ , డైరెక్టర్ ఐ.బి వారి ఆదేశాల మేరకు రాష్ట్రీయ ఏక్తా దివాస్ కార్యాక్రమం శుక్రవారం నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటి (2 కె రన్ ) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా  నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆధ్వర్యంలో 2 కె రన్ ను జండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ ఫర్ యూనిటి కార్యక్రమం జిల్లా పాత కలెక్టరెటు గ్రౌండ్ నుండి- ఎన్.టి.ఆర్ చౌరస్తా -పోలీస్ పరేడు గ్రౌండ్ – రైల్వే కమాన్ అయ్యప్ప మందిరం, మీ సేవా కార్యాలయం ,పాల్టెక్నిక్ -నీలకంఠేశ్వర్ దేవాలయం వరకు నిర్వహించారు. 
అనంతరం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. భారతదేశ ఉక్కుమనిషి గా పేరు పొందిన సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివస్ ను జాతీయ ఐక్యత దినోత్సవాన్ని జరుపు కుంటున్నాము. భారత దేశ స్వాతంత్య్ర పోరాటంలో దేశ సమగ్రత (ఐక్యత ) కొరకు కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తిగా, భారత దేశంలో గల అన్ని సంస్థానాలను విలీనం చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. ఇతనికి ఉక్కు మనిషి అని పేరు గలది అన్నారు.
అదేవిధంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. సర్ధార్ వల్లబాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని 2 కె రన్ కార్యక్రమం నిర్వహింస్తున్న సందర్భంగా యువత పెద్ద మొత్తంలో పాల్గొనడం ఎంతో ఆనంద కరమని భారత ఐక్యతా స్పూర్తికి, ప్రజల్లో జాతీయ ఐక్యత సామరస్యం, దేశభక్తి భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యమని, భారత దేశంలో గల అన్ని సంస్థానాలను విలీనం చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషించారు అని తెలిపారు. అనంతరం 2 కె రన్ లో గమ్యానికి ముందుగా చేరుకున్న వారు ఎమ్.సాయికిరణ్, డి.నాగేంధర్, వి. రాకేష్, ఆర్. ధరణి, ఎమ్.గోదావరి, ఎస్. నిఖిత, తదితరులకు జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ గార్ల చేతులమీదుగా బహుమతులను ప్రధానం చేశారు.
ఈ కార్యాక్రమంలో అదనపు డి.సి.పి (అడ్మిన్) జి. బస్వారెడ్డి, అదనపు డి.సి.పి ( ఎ.ఆర్ ) రామ్ చందర్ రావ్, నిజామాబాద్, ట్రాఫిక్ ఎ.సి.పిలు రాజా వెంకట్ రెడ్డి, మస్తాన్ అలీ, రిజర్వు ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్ (అడ్మిన్ ), తిరుపతి (వెల్ఫేర్) , సి.ఐ లు, 1,2,3,4,5,6, నిజామాబాద్ రూరల్, మాక్లూర్, ఎస్.ఐ లు, పోలీస్ స్టేషన్ సిబ్బంది. ఎ.ఆర్, స్పెషల్ పార్టీ సిబ్బంది, హోమ్ గార్డ్సు సిబ్బంది, కాలేజి విధ్యార్థులు పాల్గొన్నారు.

 
                                    