– పెరిగిన ఓఈఆర్
– ఆశాజనకంగా గెలలు ధరలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
విస్తరించిన పామాయిల్ సాగుకు అనుగుణంగా ఈ ఆయిల్ ఇయర్ గెలలు అధిక దిగుబడులు కనబరిచాయి. అలాగే ఓఈఆర్ అంటే నూనె శాతం పెరిగింది. ఆయిల్ ఫాం సాగు ప్రారంభం అయ్యాక ఈ ఆయిల్ ఇయర్ అంటే నవంబర్ 1 వ తేదీ నుండి అక్టోబర్ 31 వ తేది వరకు అప్పారావు పేట, అశ్వారావుపేట, నర్మెట్ట లో గల ఈ మూడు ఆయిల్ ఫెడ్ పామాయిల్ పరిశ్రమల్లో మొత్తం 3,30,652 మెట్రిక్ టన్నుల పామాయిల్ గెలలు క్రస్సింగ్ చేసినట్లు అప్పారావు పేట పరిశ్రమ మేనేజర్ కళ్యాణ్ గౌడ్ శుక్రవారం తెలిపారు. ఓఈఆర్ అంటే నూనె శాతం పెరుగుదల సైతం 20.01 గా నమోదు అయినట్లు వివరించారు.
ఈ ఆయిల్ ఇయర్ లో అశ్వారావుపేట పరిశ్రమలో 101943 మెట్రిక్ టన్నులు,అప్పారావు పేట పరిశ్రమలో 2,26,209 మెట్రిక్ టన్నులు, నూతనంగా నిర్మించిన నర్మెట్ట పరిశ్రమలో 2500 మెట్రిక్ టన్నుల గెలలు క్రస్సింగ్ చేసారు.
సంవత్సరం గెలలు (టన్ను ల్లో) ఓఈఆర్
2014 -15 59405.035 17.65
2015 – 16 42580.005 18.73
2016 – 17 134854.074 18.65
2017 – 18 182251.040 18.94
2018 – 19 200052.980 18.45
2019 – 20 198165.140 18.68
2020 – 21 229382.580 19.22
2021 – 22 264520.702 19.32
2022 – 23 270375.877 19.17
2023 – 24 227188.680 19.42
2024 – 25 3,30,652 20.01
విస్తరించిన సాగుకు తగ్గా దిగుబడులు వచ్చాయని,పరిశ్రమలు సైతం పెరుగుతున్న ఉందును రైతులకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉందని అప్పారావు పేట పరిశ్రమ మేనేజర్ కళ్యాణ్ గౌడ్ తెలిపారు. ఈ ఆయిల్ ఇయర్ గెలలు ధరలు సైతం ఆశాజనకంగానే ఉన్నాయని, గెలలులో నూనె శాతం పెరిగితే రైతుకు మద్దతు ధర లభించే అవకాశం ఉందని హర్షం వ్యక్తం చేసారు.



