- Advertisement -
నవతెలంగాణ- వెల్దండ
వెల్దండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ ప్రధానిగా ఇందిరాగాంధీ చేసిన సేవలను పలువురు నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోతీలాల్ నాయక్ , సింగిల్ విండో డైరెక్టర్ వెంకటయ్య గౌడ్, జిల్లా సేవాదళ్ ఉపాధ్యక్షులు కొయ్యల పుల్లయ్య, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్ర శీను, మైనార్టీ నాయకులు ఎండి రషీద్, సాయి రెడ్డి ,మహేందర్ రెడ్డి, చెన్నయ్య, గోపాలు , చందు నాయక్ ,భరత్ గౌడ్ పాల్గొన్నారు.ఫోటో. ఇందిరాగాంధీకి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు.
- Advertisement -



