• అల్లుకున్న పిచ్చి మొక్కలు తొలగింపు
• నూతన విద్యుత్ స్థంభం, ఏబీ స్విచ్ ఏర్పాటు
• లూజ్ పోల్స్ సరిచేయడానికి మరమ్మతులు
• ‘నవతెలంగాణ’కు స్థానికులు కృతజ్ఞతలు
నవతెలంగాణ -పెద్దవంగర
మండల కేంద్రంలోని సెల్ టవర్ సమీపం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు పిచ్చి మొక్కలు చుట్టుకోవడంతో ప్రమాదకరంగా మారింది. దీనిపై ‘నవతెలంగాణ’ దినపత్రిక లో ‘అల్లుకున్న నిర్లక్ష్యం’ అనే శీర్షికతో బుధవారం వార్త ప్రచురించిన విషయం విదితమే. ఈ కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. ట్రాన్స్ఫార్మర్ కు అల్లుకున్న పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రమాదకరం ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాన్ని తొలగించి, నూతన స్థంభం తో పాటుగా, ఏబీ స్విచ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు లూజ్ పోల్స్ సరిచేయడానికి అధికారులు సైతం మరమ్మతులు చేపట్టారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ‘నవతెలంగాణ’ దినపత్రికకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
నవతెలంగాణ కథనానికి స్పందన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



