నవతెలంగాణ – మల్హర్ రావు: ఆధునిక సమాజంలో చిరుతల రామాయణం లాంటి ప్రాచీన కళలను నేటి యువతకు, ప్రజలకు అందించాలని తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు అన్నారు. మండలంలోని కిషన్ రావుపల్లిలో మంగళవారం రాత్రి చిరుతల రామాయణం శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. యువకులు రామాయణంలో పాత్రలు ధరించి ఆదర్శంగా నిలువడం పట్ల అభినందించారు. రెండు నెలలగా సుమారు 30 మంది కళాకారులు చిరుతల రామాయణం ప్రదర్శన నిర్వహించేందుకు నేర్చుకున్నారని తెలిపారు. రామాయణం పాత్రలకు కోచింగ్ ఇచ్చిన గురువును అభినందించారు.ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దతూండ్ల గ్రామశాఖ అధ్యక్షుడు జక్కుల వెంకటస్వామి యాదవ్, యూత్ కాంగ్రెస్ డివిజన్ నాయకుడు మండల రాహుల్, నర్సింగరావు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
ప్రాచీన కలలను నేటి యువతకు అందించాలి..
- Advertisement -
- Advertisement -