Saturday, November 1, 2025
E-PAPER
Homeమానవిఫైబర్‌ ఎందుకు ముఖ్యం?

ఫైబర్‌ ఎందుకు ముఖ్యం?

- Advertisement -

ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు ఉన్న ఆహారం తినాలి. ఈ రోజుల్లో ఫాస్ట్‌ ఫుడ్‌, ప్రాసెస్డ్‌ డైట్‌ మన ప్లేట్‌ నుండి ఫైబర్‌ను అదృశ్యం చేశాయి. ఫైబర్‌ అంటే పీచు పదార్థం. ఇది కడుపును క్లీన్‌గా ఉంచడంతో పాటు ప్రేగుల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారంలో ఫైబర్‌ లేకపోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. క్రమంగా ఈ సమస్య పెద్ద వ్యాధులుగా మారవచ్చు. ఫైబర్‌ లేకపోవడం వల్ల ప్రేగులు క్రమంగా బలహీనపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కడుపు సంబంధిత వ్యాధులు కూడా వస్తాయంటున్నారు. ప్రతిరోజూ 25 నుండి 30 గ్రాముల ఫైబర్‌ తీసుకోవడం ముఖ్యం. దీని కోసం మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలను చేర్చుకోవాలి. ఫైబర్‌ లేకపోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

జీర్ణ సమస్యలు: ఫైబర్‌ జీర్ణక్రియకు సహాయపడుతుంది. అది లేకపోవడం వల్ల, ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. కడుపు ఉబ్బినట్లుగా, బరువుగా అనిపిస్తుంది.
అధిక ఆకలి: ఫైబర్‌ ఎక్కువసేపు కడుపు నిండినట్లు చేస్తుంది. మీకు తరుచూ ఆకలి వేస్తే మీ ఆహారంలో ఫైబర్‌ తక్కువ ఉందని అర్థం.
బరువు పెరగడం: ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారాలు నెమ్మదిగా జీర్ణమవుతాయి. శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తాయి. అతిగా తినకుండా నిరోధిస్తాయి. ఫైబర్‌ లేకపోవడం వల్ల అతిగా ఆకలివేస్తుంది. దీంతో బరువు పెరుగుతారు.
మలబద్ధకం: ఫైబర్‌ ప్రేగు కదలికలను సులభతరం చేసి.. మలబద్ధకాన్ని నివారిస్తుంది. అది లోపిస్తే మలబద్ధకం ఇబ్బంది పెడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు క్షీణించడం:
ఫైబర్‌ రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని లోపం డయాబెటిస్‌ ప్రమాదాన్ని పెంచుతుంది.

ఫైబర్‌ ఎక్కడ లభిస్తుంది?
పండ్లు: యాపిల్స్‌, బేరి, బొప్పాయి, జామకాయలు
కూరగాయలు: క్యారెట్లు, బీన్స్‌, పాలకూర, బఠానీలు
తృణధాన్యాలు: ఓట్స్‌, బ్రౌన్‌ రైస్‌, దాలియా, బార్లీ
పప్పుధాన్యాలు
: రాజ్మా, మూంగ్‌, చిక్‌పీస్‌
విత్తనాలు-గింజలు: అవిసె గింజలు, చియా గింజలు, బాదం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -