వర్షాలతో బురదమయంగా పొలాలు
నవతెలంగాణ – మల్హర్ రావు.
రైతుల పరిస్థితి ముందు నుయ్యి..వెనుక గొయ్యిలా తయారైంది.ఆరుగాలం కష్టపడి పంటలు కాపాడుకుంటూ వస్తున్నా..కోత దశలో అవస్థలు తప్పడం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పొలాలు బురదమయంగా మారడంతో చైన్ మిషన్లతో వరి కోతలు కోస్తున్నారు. టైర్ హార్వెస్టర్లతో పోలిస్తే ఎకరాకు రూ.1000 అదనంగా చెల్లించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే అతివృష్టితో వందలాది ఎకరాల్లో పొలాలు నేలకొరిగి నష్టం వాటిల్లగా, తెగుళ్ళ బెడదతో మరింత నష్టపో యారు. ప్రస్తుతం కోత సమయంలోనూ ఆర్ధిక భారం తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మండలంలో 15,500 వేల ఎకరాల్లో వరి సాగైయింది.మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు మానేరు,అరేవాగు, బొగ్గుల వాగు ప్రాజెక్టు, కుంటలు పొంగిపొర్లాయి.కాగా వర్షాలు శుక్రవారం నుంచి తగ్గుముఖం పట్టడంతో ఆయకట్టు ప్రాంతంలోని ఇప్పుడిప్పుడే వరి కోతలు ప్రారంభం కాకపోగా,నాన్ ఆయకట్టు ప్రాంతంలో మాత్రం వరి కోతలు ప్రారంభమైయ్యాయి
వరి కోత.. రైతన్నకు భారం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



