Saturday, November 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరైతు నేత సామినేని హత్యను ఖండిస్తున్నాం

రైతు నేత సామినేని హత్యను ఖండిస్తున్నాం

- Advertisement -

– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన రైతు సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీపీఐ(యం) రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు సామినేని రామారావును అత్యంత కిరాతకంగా హత్య చేయడాన్ని ఖండిస్తున్నామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌రావు, టి. సాగర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీవిత చరమాంకం వరకు రైతు సమస్యలపై పోరాడారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాతర్లపాడు గ్రామపంచాయతీలో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్‌ గూండాలు అత్యంత కిరాతకంగా హత్య చేశారని ఆరోపించారు. తెల్లవారుజామున తన ఇంట్లో ఉండగా గూండాలు కత్తులతో పొడిచి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -