సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జోనర్‌లో తీర్థ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘సందిగ్ధం’. నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ దేవ్, కాజల్ తివారి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. పార్ధ సారథి కొమ్మోజు దర్శకత్వంలో సంధ్య తీరువీధుల నిర్మిస్తున్న ఈచిత్ర టీజర్‌ను నటుడు, నిర్మాత అశోక్ కుమార్ శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’ప్రస్తుతం ఓ సినిమా సక్సెస్ అవ్వడం చాలా కష్టంగా మారింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా పెరిగింది. పది, పదిహేను కోట్లు లేకపోతే సినిమా తీయలేకపోతున్నారు. కరోనా తరువాత పరిస్థితులు మారిపోయాయి. మూవీకి మంచి టాక్ వస్తే జనాలు థియేటర్లకు వస్తున్నారు. జనాలకి రీచ్ అయ్యేలా సినిమాని ప్రమోట్ చేయాలి. ఈ చిత్ర టీజర్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చే చిన్న చిత్రాలు కూడా పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. భార్యా భర్తలైన సంధ్య, పార్దు కష్టపడి తీసిన ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘పార్ద సారథి చెప్పిన కథ నాకెంతో నచ్చింది. ఆయన వల్లే నేను ఈ మూవీలోకి వచ్చాను.
సంధ్య ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు’ అని హీరో నిహాల్ చెప్పారు. మరో హీరో అర్జున్ దేవ్ మాట్లాడుతూ,’సినిమాను చూసి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఈ సినిమా విషయంలో ప్రతీ ఆర్టిస్ట్, టెక్నీషియన్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇలాంటి కథ ఇంత వరకు రాలేదని చెప్పొచ్చు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ ప్రయాణంలో నాకు నా భార్య సంధ్య తోడుగా నిలిచింది. నన్ను దర్శకుడిగా చేయాలని ఎంతో కష్టపడి ఈ సినిమాను నిర్మించింది’ అని దర్శకుడు పార్ధ సారథి తెలిపారు. ప్రియా దేశ్ పాగ్ మాట్లాడుతూ,’ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. టీజర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ చిత్రం కూడా ప్రేక్షకుల్ని కచ్చితంగా మెప్పిస్తుంది’ అని అన్నారు. ‘పార్ధు నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. పట్టుదలతో సొంత బ్యానర్‌లో ఈ మూవీని రూపొందించారు. సంగీతానికి మంచి స్కోప్ ఉన్న స్క్రిప్ట్ ఇది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తుంది’ అని సంగీత దర్శకుడు గౌతమ్ చెప్పారు.
సరికొత్త కాన్సెప్ట్‌తో ‘సందిగ్ధం’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



