Saturday, November 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవిశ్వాసాల ముసుగులో దాడులు

విశ్వాసాల ముసుగులో దాడులు

- Advertisement -

ఎంఆర్‌పీఎస్‌ ఆధ్వర్యంలో నేడు ఆత్మగౌరవ ప్రదర్శన : మంద కృష్ణమాదిగ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

విశ్వాసాల ముసుగులో దాడులకు పాల్పడితే..దళితులు చూస్తూ ఊరుకోబోమని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. సీజేఐపై దాడి జరిగి 25రోజులు గడుస్తున్నా..ఇప్పటి వరకు నిందితున్ని అరెస్టు చేయకపోవటమేంటని ప్రశ్నించారు. సీజేఐ గవారు దళితుడు కాబట్టే ఈ నిర్లక్ష్యం కొనసాగుతున్నదని చెప్పారు. దీనికి నిరసనగా శనివారం హైదరాబాద్‌లో ఆత్మగౌరవ ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దళితుల మీద జరిగిన దాడి మాత్రమే కాదనీ, రాజ్యాంగ వ్యవస్థమీద జరిగిన దాడిగా చూడాలన్నారు. అసమానతలను తొలగించేందుకు రాజ్యాంగం కృషి చేస్తున్నదనీ, ఇది సహించలేని వారు మాత్రమే ఇట్లాంటి దాడులకు పాల్పడతారన్నారు. జార్ఖండ్‌లో జడ్జితో వాగ్వాదానికి దిగినందుకే..న్యాయవాదిపై సుమోటోగా కేసు నమోదు చేశారనీ, సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరిగితే సుమోటోగా ఎందుకు కేసు ఫైల్‌ చేయటం లేదని ప్రశ్నించారు. వ్యవస్థలు మౌనంగా ఉంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్‌ నరేష్‌మాదిగతో పాటు ఆ సంఘం నేతలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -