Saturday, November 1, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇంట్లో ఈగల మోత…బయట పల్లకీ మోత

ఇంట్లో ఈగల మోత…బయట పల్లకీ మోత

- Advertisement -

ట్రంప్‌ ఆసియా పర్యటనపై విశ్లేషకుల వ్యాఖ్య
వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పరిస్థితి ఇంట్లో ఈగల మోత…బయట పల్లకీ మోత అన్న చందంగా తయారైంది. ఆసియా దేశాల పర్యటనను విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి చేరుకున్న ఆయనను అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రభుత్వ షట్‌డౌన్‌ కొనసాగుతోంది. ఫలితంగా ఫెడరల్‌ ఉద్యోగాలలో కోత పెట్టాల్సి వస్తోంది. మరోవైపు ట్రంప్‌ రేటింగ్‌దిగజారిపోతోంది. ఆయన ప్రతిష్ట మసకబారుతోంది.
మా సమస్యల సంగతేమిటి?
విదేశాలలో తన ప్రతిష్టను పెంచుకోవ డానికి ట్రంప్‌ తహతహలాడతారన్న విషయం అందరికీ తెలిసిందే. కాంబోడియా- థాయిలాండ్‌ మధ్య ఆయన కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చారు. అమెరికాలో 500 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెడతామని జపాన్‌ హామీ ఇచ్చింది. అమెరికా నౌకా నిర్మాణం కోసం 150 బిలియన్‌ డాలర్లు అందజేస్తానని దక్షిణ కొరియా చెప్పింది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ తమ సమస్యల పరిష్కారం మాటేమిటని ఆయనకు ఓటేసిన అమెరికన్లు ప్రశ్నిస్తున్నారు.
ప్రపంచ దేశాలపై కాదు…ముందు తమపై దృష్టి సారించాలని వారు కోరుకుంటు న్నారు. కానీ ఇదేమీ ట్రంప్‌ తలకు ఎక్కినట్లు లేదు. ఆయన దృష్టంతా ఆసియా, మధ్యప్రాచ్యం పైనే ఉంది. అసలు ట్రంప్‌ ఏం సాధించదలచుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని విశ్లేషకులు తెలిపారు.
విదేశీ నేతలతో జరుపుతున్న సమావేశాల్లో పెట్టుబడులపై హామీలు వస్తున్నాయే కానీ ఆయా దేశాలతో దీర్ఘకాల సంబంధాలు నెలకొల్పుకోవడంపై ట్రంప్‌ పెద్దగా ఆసక్తి చూపడం లేదని వారు అభిప్రాయపడ్డారు. ట్రంప్‌లో స్థిరత్వం లోపించిందని తేల్చి చెప్పారు.
పేరు ప్రతిష్టల కోసం తహతహ
ఆసియా పర్యటనలో భాగంగా ముందుగా మలేసియాలో అడుగు పెట్టిన ట్రంప్‌కు రెడ్‌ కార్పెట్‌ స్వాగతం లభించింది. జపాన్‌లోనూ ఆయనకు సాదర పూర్వక స్వాగతం పలికారు. దక్షిణ కొరియా స్వర్ణ పతకాన్ని, కిరీటాన్ని బహుమతిగా అందజేసింది. ఆసియా నేతలు, వ్యాపారవేత్తలతో జరిపిన సమావేశాలు తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ప్రపంచ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. తన గౌరవార్థం జరిగే విందు సమావేశాలకు హాజరై ఉల్లాసంగా గడుపుతారు. అక్కడక్కడా డ్యాన్సులు కూడా చేస్తారు. విదేశీ నేతల ప్రశంసలు విని ఉప్పొంగి పోతారు. ఒక్క మాటలో చెప్పాలంటే అంతర్జాతీయ వేదికలపై తన ముద్ర వేయడానికి ట్రంప్‌ చేయని ప్రయత్నమంటూ ఉండదు. ఫ్యాక్టరీ ఉద్యోగాలను సృష్టించాలన్న తన దేశీయ అజెండాను నెరవేర్చుకోవడానికి ట్రంప్‌ దౌత్యాన్ని ఎంచుకుంటారని డెన్మార్క్‌లో గతంలో అమెరికా రాయబారిగా పనిచేసిన కార్లా శాండ్స్‌ చెప్పారు.
పరువు తీస్తున్న షట్‌డౌన్‌
ఈ ఏడాది న్యూయార్క్‌ మేయర్‌ పదవికి, వర్జీనియా, న్యూజెర్సీ గవర్నర్ల పదవులకు జరగబోయే ఎన్నికలు ట్రంప్‌ పాలనకు అగ్నిపరీక్షగా నిలవబోతున్నాయి. నెల రోజులుగా సాగుతున్న షట్‌డౌన్‌ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులకు జీతాలు సరిగా అందడం లేదు. కొందరిని ఇంటికి పంపుతున్నారు. లక్షలాది మంది పేదలు, అల్పాదాయ వర్గాల ప్రజలకు లభిస్తున్న ఆహార సాయం రేపో మాపో నిలిచిపోబోతోంది. ఇమ్మిగ్రేషన్‌ విధానాలపై వెల్లువెత్తిన నిరసనలు సరేసరి. ఈ పరిస్థితుల్లో ట్రంప్‌ నాయకత్వంపై ప్రజల్లో అపనమ్మకం పెరుగుతోంది. ప్రతి పది మంది పెద్దల్లో ఆరుగురు ట్రంప్‌ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని అసోసియేటెడ్‌ ప్రెస్‌-ఎన్‌ఓఆర్‌సీ సెంటర్‌ గత నెలలో నిర్వహించిన సర్వేలో తేలింది. న

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -